Breaking News
Home / Film News / కథ విని చాలా సార్లు భయపడ్డాను….

కథ విని చాలా సార్లు భయపడ్డాను….

ఫిల్మ్ న్యూస్: తెలుగు తెరకి ఉయ్యాలా జంపాలా సినిమాతో పరిచయమైన అవికా గోర్, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత చేసిన సినిమా చూపిస్త మావ .. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. కొన్ని కారణాల వలన గ్యాప్ తీసుకున్న ఆమె, తాజాగా రాజుగారి గది 3 చేసింది.

ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ ..చేసిన పాత్రకి ముందుగా తమన్నాను అనుకున్నారు. ఆమె డేట్స్ కుదరకపోవడం వలన, కథ నా దగ్గరికి వచ్చింది. కథ వింటూ చాలాసార్లు భయపడ్డాను. చూసే వాళ్లకి కూడా అదే ఫీల్ కలుగుతుంది. ఈ కథను కాదని చెప్పడానికి కారణాలు కనిపించలేదు. కొత్త పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఓకే చెప్పాను. తప్పకుండా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అని చెప్పుకొచ్చింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *