Breaking News
Home / National / ఈ చిత్రపటాన్ని మోదీకి బహుమతిగా ఇస్తాను….

ఈ చిత్రపటాన్ని మోదీకి బహుమతిగా ఇస్తాను….

అమృత్‌సర్‌: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి (అక్టోబర్‌2) పురస్కరించుకొని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గాంధీజీకి భారీ చిత్రంతో నివాళి సమర్పించనున్నాడు. జగ్‌జ్యోత్‌ సింగ్‌ అనే చిత్రకారుడు ఈ బొమ్మను గీయడానికి 10 రోజుల సమయం తీసుకున్నాడు. బొమ్మ విస్తీర్ణం 5 ఫీట్ల వెడల్పు, 7 ఫీట్ల పొడవుంది. ఇంతకు ముందు నేను చాలా బొమ్మలు వేశాను. కానీ, గాంధీజీ బొమ్మ ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ మహాత్ముడి బొమ్మను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు అతను తెలిపాడు. ఎందుకంటే, గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెడుతున్న ప్రధాని, మహాత్ముణ్ని చాలా ఇష్టపడతాడు. అందుకే ఈ చిత్రాన్ని మోదీజీకి ఇవ్వాలనుకుంటున్నట్లు జగ్‌జ్యోత్‌ తెలిపాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *