Breaking News
Home / States / ప్రజా వ్యవస్థ బలోపేతం కోసం కృషిచేస్తాను….

ప్రజా వ్యవస్థ బలోపేతం కోసం కృషిచేస్తాను….

హైదరాబాద్‌: బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలంగాణ బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బీసీ కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో సీఎం కేసీఆర్‌ రెండు శాఖలు అప్పగించడం సంతోషమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా అందరికీ ఉన్నత విద్య అందడం లేదని అన్నారు. ప్రజా వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అధికారులు మంత్రి కమలాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *