Breaking News
Home / National / ప్రధాని పయనించే విమానాలకు ఐఎఎఫ్ పైలెట్లు…

ప్రధాని పయనించే విమానాలకు ఐఎఎఫ్ పైలెట్లు…

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణించే బి-777 విమానాలను ఇకపై భారత వైమానిక దళం పైలెట్లు నడిపించనున్నారు. ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ విభాగం ఈ విమానాల నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. ప్రస్తుతం ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బి747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై నెలనాటికి అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీ నుంచి రెండు బి-777 విమానాలు రానున్నాయని ఒక అధికారి చెప్పారు. ఈ విమానాలపై ఎయిర్‌ ఇండియా వన్‌ అనే గుర్తుంటుందని అన్నారు. బి-777 విమానాలను నడిపించడంలో ఇప్పటికే ఆరుగురు ఐఎఎఫ్‌ పైలెట్లకు శిక్షణ ఇచ్చినట్లు ఆ అధికారి తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *