Breaking News
Home / Sports / ధోనీని రనౌట్ చేసిన గప్టిల్‌పై ఐసీసీ ప్రశంసల వర్షం

ధోనీని రనౌట్ చేసిన గప్టిల్‌పై ఐసీసీ ప్రశంసల వర్షం

మాంచెస్టర్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ భారత జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. ఒత్తిడిలో ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సిద్ధహస్తుడైన ధోనీ టీమిండియాను ఫైనల్‌కు చేర్చుతాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే, మార్టిన్ గప్టిల్ అద్భుతమైన త్రోకు రనౌట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా విజయానికి కావాల్సింది 25 పరుగులు కాగా, చేతిలో 10 బంతులు ఉన్నాయి.

ధోనీ క్రీజులో ఉండడంతో అద్భుతం జరుగుతుందనే అందరూ ఆశించారు. అయితే, గప్టిల్ గురితప్పకుండా విసిరిన త్రోకు వికెట్లు భళ్లుమన్నాయి. భారత శిబిరం ఘొల్లుమంది. గప్టిల్ త్రోపై ఐసీసీ ప్రశంసలు కురిపించింది. షార్ట్ ఫైన్ లెగ్ నుంచి బంతిని బ్రహ్మాండంగా వికెట్లకు గురిచూసి కొట్టాడని ఆకాశానికెత్తేసింది. ‘అత్యద్భుతమైన క్షణాలు’ అని ట్వీట్ చేసింది.

Check Also

ఛాలెంజ్ విరిసిన యువరాజ్.. గెలిచిన ధవన్

Share this on WhatsAppన్యూఢిల్లీ: చేతి వేలి గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీ నుంచి బయటకొచ్చిన శిఖర్ ధవన్.. చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *