Breaking News
Home / National / పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు…

పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు…

న్యూఢిల్లీ: దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రసంసలు కురిపించారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని మాయావతి పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *