Breaking News
Home / National / ఐడీఎఫ్‌సీ బ్యాంకు పేరు మారింది

ఐడీఎఫ్‌సీ బ్యాంకు పేరు మారింది

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంకు పేరు మారింది. శనివారం నుంచి దీనిపేరు ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్’గా మారింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌(బీఎస్ఈ)కి చెన్నైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలియజేసింది. ‘‘ఐడీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌ పేరు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్ లిమిటెడ్‌గా మారింది. జనవరి 12, 2019 నుంచే ఇది అమల్లోకి వస్తుంది’’ అని పేర్కొంది.

ఐడీఎఫ్‌సీ బ్యాంక్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కేపిటల్ ఫస్ట్‌లు డిసెంబరు 18న విలీనమయ్యాయి. విలీనంతో ఈ రెండు బ్యాంకుల విలీన పరిధి రూ.1.03 లక్షల కోట్లకు చేరింది. రెండింటికి కలిపి 203 బ్యాంకు బ్రాంచులు, 129 ఏటీఎంలు, 454 మంది రూరల్ బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 7.2 మిలియన్ల మంది వినియోగదారులకు సేవలందించనుంది.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *