Breaking News
Home / States / Andhra Pradesh / ‘సీఎంపై 13 కేసులుంటే ఇతరులపై కూడా పెడతారా?’

‘సీఎంపై 13 కేసులుంటే ఇతరులపై కూడా పెడతారా?’

విశాఖ : సీఎం జగన్‌పై 13 కేసులున్నాయి కాబట్టి, మిగితా వారందరిపై కూడా కేసులు పెట్టాలని అనుకుంటున్నారా? అని మాజీ మంత్రి చినరాజప్ప ఎద్దేవా చేశారు. తమపై కేసులు పెడితే భయపడేది లేదని, ప్రజలకు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ టీడీపీ కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. 10,11 తేదీల్లో విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంటుందని, రెండు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహిస్తారని ఆయన ప్రకటించారు.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని, ఎంత అణగదొక్కితే అంతపైకి వస్తామని అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఒక్కోనేత ఒక్కోలా మాట్లాడుతున్నారని, అయినా సీఎం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. రాజధానిపై మరింత స్పష్టతనివ్వాలని సీఎంను అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *