Breaking News
Home / States / Andhra Pradesh / ‘ప్రభుత్వం మారితే రాజధానిని మార్చేస్తారా?’

‘ప్రభుత్వం మారితే రాజధానిని మార్చేస్తారా?’

గుంటూరు: ప్రభుత్వం మారితే రాజధానిని మార్చేస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాజధానులను నిరంతరం మార్చుకుంటూ పోతే రాష్ట్ర పరువు పోతోందన్నారు. జగన్ పాలనలో కక్షసాధింపు ధోరణి కనబడుతోందన్నారు. మంగళవారం కన్నా లక్ష్మీనారాయణను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. రాజధాని తరలింపును అడ్డుకోవాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ.. రాష్ట్రంలో భయంతో బతకాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. కేంద్రం హెచ్చరించినా జగన్ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *