Breaking News
Home / National / సీఆర్‌పీఎఫ్ లేకుంటే నేను తప్పించుకోవడం కష్టమయ్యేది: అమిత్‌షా

సీఆర్‌పీఎఫ్ లేకుంటే నేను తప్పించుకోవడం కష్టమయ్యేది: అమిత్‌షా

న్యూఢిల్లీ: తన రోడ్‌షో సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తప్పుపట్టారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, హింసాకాండకు బీజేపీదే బాధ్యతంటూ టీఎంసీ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. ఆరు విడతల ప్రచారంలో ఒక్క పశ్చిమబెంగాల్‌లో మినహా ఎక్కడా హింస చెలరేగలేదని ఆయన గుర్తుచేశారు.

‘ఇది (హింసాకాండ) మా పనేనని మమతా బెనర్జీ చెబుతున్నారు. ఆమెకు నేను చెప్పదలచుకున్నది ఒకటే. టీఎంసీ పశ్చిమబెంగాల్‌లో కేవలం 42 సీట్లలోనే పోటీ చేస్తోంది. మేము దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ పోటీ చేస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హింస చెలరేగలేదు. ఒక్క పశ్చమబెంగాల్‌లోనే జరిగింది. దీనికి టీఎంసీదే బాధ్యత’ అని అమిత్‌షా స్పష్టం చేశారు. కోల్‌కతాలో హింసాకాడం చెలరేగిన సమయంలో సీఆర్‌పీఎఫ్ కనుక అక్కడ లేకుండా ఉంటే దాడి నుంచి తాను తప్పించుకోవడం కష్టమయ్యేదని, బీజేపీ కార్యకర్తలను చితక్కొట్టారని చెప్పారు. టీఎంసీ ఎంత వరకైనా వెళ్తుందని, దాడి నుంచి తాను అదృష్టం వల్లే తప్పించుకోగలిగానని అమిత్‌షా చెప్పారు. తన రోడ్‌షోకు ముందు బీజేపీ బ్యానర్లు తొలిగిస్తుంటే పోలీసులు మౌనప్రేక్షకులుగా మిగిలిపోయాయని, ప్రధాని పోస్టర్లు, తన పోస్టర్లు చింపేసినప్పటికీ బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని అమిత్‌షా తెలిపారు.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *