Breaking News
Home / National / పటేల్ కనుక మోదీని కలుసుకుని ఉంటే.ఎలా ఉండేది? : ఆనంద్ శర్మ

పటేల్ కనుక మోదీని కలుసుకుని ఉంటే.ఎలా ఉండేది? : ఆనంద్ శర్మ

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక మోదీని కలుసుకుని ఉంటే…ఎలా ఉండేది? మోదీపై పటేల్ ఆగ్రహం వ్యక్తం చేసి ఉండేవారట. ఈ మాటలు అన్నదెవరో కాదు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ. పౌరసత్వ సవరణ బిల్లుపై బుధవారంనాడు జరిగిన చర్చలో ఆనంద్ శర్మ మాట్లాడుతూ, మన మతంలో పునర్జన్మలుంటాయని, మన పెద్దవాళ్లే మళ్లీ పుట్టి వాళ్లను మనం కలుసుకుంటామనే నమ్మకాలు ఉన్నాయని అన్నారు. ఆ ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక మోదీజీని కలిసి ఉంటే, ఆయనపై పటేల్ ఆగ్రహం వ్యక్తం చేసేవారని అన్నారు. గాంధీజీ అయితే విచారం వ్యక్తం చేసేవాడని, పటేల్ అయితే మాత్రం నిప్పులు చెరిగేవారని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ మేనిఫెస్టోలో భాగమే పౌరసత్వ బిల్లు అని హోం మంత్రి అమిత్‌షా పేర్కొనడానికి ఆనంద్ శర్మ ప్రస్తావిస్తూ, ఏ మేనిఫెస్టో అయినా రాజ్యాంగం కంటే గొప్పది కాదన్నారు. దేశ విభజనకు తమ పార్టీనే కారణమని ఆరోపించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.

జిన్నా ఎప్పుడూ రెండు దేశాలు సిద్ధాంతాన్ని తీసుకురాలేదని, 1937లో గుజరాత్‌లో జరిగిన హిందూ మహాసభలోనే దీనిని ప్రవేశపెట్టారని శర్మ అన్నారు. 1955 నుంచి పౌరసత్వ చట్టానికి మార్పులు జరిగాయని, అయితే ఎప్పుడూ చట్టంలోని మౌలిక సూత్రాలను మార్చలేదన్నారు. దేశ విభజన తర్వాత కూడా పాకిస్థాన్ నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చారని, వారిలో ఇద్దరు… డాక్టర్ మన్మోహన్ సింగ్, ఐకే గుజ్రాల్ ప్రధానులు కూడా అయ్యారని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా కొత్తగా చరిత్ర రాయలేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ మూలాలపై జరుగుతున్న దాడి అని, నైతిక పరీక్షలో విఫలమైందని తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *