Breaking News
Home / Film News / అలా అయితే హీరోగా నటిస్తాడట!

అలా అయితే హీరోగా నటిస్తాడట!

ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను వెండితెరపై కథానాయకుడిగా చూపించాలని గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా దేవి ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా ప్రయత్నాలు ఫలించలేదు. `సరిలేరు నీకెవ్వరు` విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తను హీరోగా నటించడం గురించి దేవి స్పందించాడు.

`నాకు సంగీతం మీద ఉన్న విపరీతమైన ఇష్టం వల్ల యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా బిజీగా ఉన్నాను. ఓ బాలీవుడ్ సినిమాకు కూడా కమిటయ్యాను. హీరోగా సినిమా చేయమని చాలామంది అడుగుతున్నారు. తమిళం నుంచి ఇంకా ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఏదైనా ఉంటే తప్పకుండా హీరోగా చేస్తాన`ని దేవి తెలిపాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *