Breaking News
Home / States / సమ్మెకు దిగితే చర్యలు తప్పవు…

సమ్మెకు దిగితే చర్యలు తప్పవు…

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చించామని.. సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన ఆర్టీసీ కార్మికులను హెచ్చరించారు. ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు విఫలమైన నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ నేపథ్యంలోని ఐఏఎస్‌ అధికారుల కమిటీ మీడియాతో మాట్లాడింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని.. ప్రభుత్వం తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరిస్తుందని సోమేశ్‌కుమార్‌ చెప్పారు. సమ్మె కొనసాగితే ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. అద్దె, ప్రైవేట్‌ బస్సులు నడుపుతామని చెప్పారు.

”దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ ఏర్పాటు చేసి ప్రైవేటు, అద్దె బస్సులను నడుపుతాం. ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని వారికి చెప్పాం. అవసరమైతే పాఠశాల బస్సులు నడుపుతాం. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగిస్తాం అన్నారు. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే మేం ప్రయత్నిస్తున్నాము అని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *