Breaking News
Home / States / Andhra Pradesh / బోటు బయటకు తీయకపోతే…..?

బోటు బయటకు తీయకపోతే…..?

రాజమండ్రి: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటును తనకు అవకాశం ఇస్తే రెండు గంటల్లోనే బయటకు తీసి చూపుతానంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాహసవీరుడు శివ మరోసారి సవాల్ విసిరారు. బోటు వెలికితీసేందుకు తన సూచనలను ధర్మాడి సత్యం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు. గతంలో నేను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నాను. బోటును వందకు వంద శాతం బయటకు తీస్తాను. ‘‘బోటు తీసేటప్పుడు సహాయక బృందాలకు ప్రభుత్వం తరుపున శివను పంపుతున్నామని కలెక్టర్, ఎస్పీ చెప్పారు. మీకు సహాయంగా శివ ఉంటాడు. అంతేకాదు ఆయన సలహాలు కూడా తీసుకోవాలని సహాయక బృందాలకు చెప్పారు. వెళ్లిన తర్వాత శివ నీవు పైనే ఉండు అని బృందాలు చెప్పాయి. దీంతో నేను రెండు రోజుల పాటు మాట్లాడలేదు. నేను బోటును బయటకు తీయకపోతే గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇస్తాను’’ శివ సవాల్ విసిరారు. కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటు వెతికితీసేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ బోటును బయటకు తీయడానికి సాధ్యం కాలేదు.

గతంలో శివ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకశాఖ అధికారులు, బోటు యజమానులు అందరూ కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని, తనకు అవకాశమిస్తే రెండుగంటల్లో దాన్ని బయటకు తెస్తానన్నారు. గతంలో మంటూరు-వాడపల్లి మధ్య లాంచీ మునిగినప్పుడు తానే తీశానని, గతంలో కూడా అనేక లాంచీలు, బోటులను బయటకు తీసినట్టు తెలిపారు. ఆ అనుభవంతోనే తనను పిలిచారని, ప్రమాదం జరిగిన రెండో రోజే మునిగిన బోటును గుర్తించి లంగరు వేశానన్నారు.

మరోవైపు కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు వెలికితీత పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ధర్మాడి సత్యం తెలిపారు. గోదావరి వరద పెరుగుతుండడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బోటును వెలికితీసే ప్రయత్నాలను తాత్కాలికంగా ఆపివేశామన్నారు. నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, తొలిరోజు యాంకర్ ద్వారా బోటు ఆచూకీ కోసం ప్రయత్నించగా అది పెద్ద పెద్ద రాళ్లకు తగిలి విరిగి పోయిందన్నారు. రెండవ రోజు రెండు యాంకర్లతో ప్రయత్నాలు కొనసాగించామని, యాంకర్లు బండరాళ్లకు తగులుకోవడంతో రోప్‌లు తెగిపోయాయన్నారు. మూడవ రోజు గోదావరి వరద ఉధృతి పెరగటంతో వెలికితీత పనులు ఆపివేశామని ఆయన వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *