గువాహటి: అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2021నుంచి అమల్లోకి వస్తాయని భేటీ అయిన కేబినెట్ సమావేశంలో ప్రకటించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని నిరుపేదలకు మూడు బిగాల భూమి ఇవ్వాలని.. అలాగే ఇంటి నిర్మాణం కోసం సగం బిగా భూమి ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఒక బిగా భూమి 0.40052356 ఎకరానికి సమానం. ప్రభుత్వం ఇచ్చే భూమిని 15 సంవత్సరాల వరకు విక్రయించే అవకాశం ఉండదని తెలిపింది. అలాగే రాష్ట్రంలో బస్సు ఛార్జీలను 25శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.
