Breaking News
Home / States / రాష్ట్రానికి శక్తి లేకపోతే… కేంద్రానికి అప్పగించండి…

రాష్ట్రానికి శక్తి లేకపోతే… కేంద్రానికి అప్పగించండి…

హైదరాబాద్‌: లాభాల్లో కొనసాగిన సింగరేణిసంస్థ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సింగరేణిలో ఆర్ధిక సంక్షోభం పై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌చేశారు. గోదావరి ఖనిలో సింగరేణి కార్మిక హక్కుల పరిరక్షణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లయ్య బీఎంఎస్‌లో చేరారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం వుందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణిని నడిపే శక్తి రాష్ర్టానికి లేకపోతే వెంటనే కేంద్రానికి అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *