Breaking News
Home / National / రైలు రావటం ఆలస్యమైతే… ప్రయాణికులకు పరిహారం…

రైలు రావటం ఆలస్యమైతే… ప్రయాణికులకు పరిహారం…

న్యూఢిల్లీ : భారత రైల్వేల చరిత్రలో తొలిసారిగా రైలు సకాలంలో రానిపక్షంలో ప్రయాణీకులకు పరిహారం చెల్లించే పద్ధతి అందుబాటులోకి రానుంది. తమ రైలు నిర్ధేశిత సమయానికి రావడంలో జాప్యం జరిగితే తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ పరిహారం చెల్లించనుంది. రైలు గంటకుపైగా లేటయితే ప్రతి ప్రయాణికుడికి రూ 100 పరిహారం, రెండు గంటలకు పైగా రైలు రాకలో జాప్యం చోటుచేసుకుంటే ప్రతి ప్రయాణికుడికి రూ 250 చెల్లిస్తారు. దేశంలోనే తొలి ప్రైవేట్‌ ఆపరేటర్‌ ద్వారా నడిచే ఈ రైలును ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 14 నుంచి ఢిల్లీ-లక్నో, లక్నో-ఢిల్లీ రూట్లలో నడిచే ఈ రైలును లక్నో నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ప్రారంభించనున్నారు. ఇక రైలు సమయంలో జాప్యం జరిగితే పరిహారం చెల్లించడంతో పాటు అదనపు చార్జీలు వసూలు చేయకుండా తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ రూ 25 లక్షల ప్రయాణ బీమాను అందుబాటులోకి తీసుకువస్తుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *