Breaking News
Home / States / నివారించలేకపోతే పరిహారం చెల్లించండి….

నివారించలేకపోతే పరిహారం చెల్లించండి….

హైదరాబాద్‌: రాష్ట్రంలో విజృంభించిన డెంగ్యూ జ్వరాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న జరిగిన విచారణతో ధర్మాసనం అధికారులను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఈ రోజు విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, వైద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. డెంగ్యూ నివారణకు తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, అధికారులు తీసుకున్న చర్యలు కేవలం కాగితాలపై మాత్రమే కనబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది.

క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగాలేదనీ డెంగ్యూని నివారించలేకపోతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు చెల్లించాలని వ్యాఖ్యానిస్తూ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులదేనని స్పష్టంచేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగుంటే ప్రజలు కోర్టులకు ఎందుకు వస్తారు? అని ధర్మాసనం ప్రశ్నించింది.

మూసీ నదిని ఉన్నతాధికారులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. నగరంలో 427 చోట్ల దోమల బెడద అధికంగా ఉందని అధికారులు తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని కోర్టుకు వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *