Breaking News
Home / National / ఆ దుస్తులను ధరిస్తే డ్రైవింగ్‌ టెస్ట్‌కు నో….

ఆ దుస్తులను ధరిస్తే డ్రైవింగ్‌ టెస్ట్‌కు నో….

చెన్నై: చెన్నైలోని కేకే నగర్‌ ఆర్టీవో కార్యాలయానికి ఓ మహిళ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకొని టెస్ట్‌ కొరకు జీన్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి వెళ్లింది. అక్కడి అధికారులు ఆమెను తక్షణమే సరైన దుస్తులు ధరిస్తే కానీ టెస్ట్‌కు అంగీకరించేది లేదంటూ తిప్పి వెనక్కి పంపారు. మరో మహిళ కూడా పొట్టి లంగా వేసుకుని టెస్ట్‌ కోసం వస్తే ఆమెను కూడా అదే కారణంతో నిరాకరించారు. కేవలం మహిళలను మాత్రమే కాకుండా మగవారు కూడా లుంగీ, షార్ట్‌ వంటి వాటిలో టెస్ట్‌ కోసం వస్తే వారిని కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నట్లు ఆర్టీవో అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. 2018 నుంచి కేకే నగర్‌ ఆర్టీవో కార్యాలయం మీద ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసే కార్యాలయం ప్రభుత్వ కార్యాలయమని ఇక్కడకు వచ్చేవారిని సరైన దుస్తులు ధరించాలని కోరడంలో తప్పేముందని ఆర్టీవో అధికారి ప్రశ్నించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *