Breaking News
Home / Film News / ఇలియానా తొలిసారిగా..!

ఇలియానా తొలిసారిగా..!

చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న గోవా బ్యూటి ఇలియానా అమర్‌ అక్బర్‌ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు ఇలియానా స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల పరభాషా హీరోయిన్లందరు తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే కీర్తి సురేష్‌, తమన్నా, పూజ హెగ్డే లాంటి హీరోయిన్స్‌ ఓన్‌ వాయిస్‌తో ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో ఇలియానా కూడా చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమర్‌ అక్బర్ ఆంటొని నవంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Also

పోర్న్‌ స్టార్‌గా రమ్యకృష్ణ..!

Share this on WhatsAppబాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆకట్టుకున్న సీనియర్‌ నటి రమ్యకృష్ణ మరో సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *