Breaking News
Home / Film News / సల్మాన్ కు నో చెప్పిన ఇలియానా….

సల్మాన్ కు నో చెప్పిన ఇలియానా….

ముంబై: గోవా బ్యూటీ ఇలియానా.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు నో చెప్పారట. ఈ విషయాన్ని ఇలియానానే స్వయంగా చెప్పారు. ‘దేవాదాస్‌’, ‘పోకిరి’, ‘కిక్‌’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ.. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్‌ చిత్రాల్లో కూడా నటించారు. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘పాగల్‌పంతీ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇలియానా తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘వాంటెడ్‌’, ‘కిక్‌’ సినిమాల్లో నటించాలని మొదట తనను అడిగారట. కాకపోతే ఆ సమయంలో తాను వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల సల్మాన్‌ చిత్రాలకు నో చెప్పానని చెప్పుకొచ్చారు. అయితే ఇలియానా నో చెప్పిన రెండు చిత్రాలు కూడా తెలుగు చిత్రాలకు రీమేక్‌లు కావడం విశేషం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *