Breaking News
Home / Film News / ఐటెం సాంగ్స్ పై ఆసక్తి లేదంటున్న భామ…..

ఐటెం సాంగ్స్ పై ఆసక్తి లేదంటున్న భామ…..

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఇలియానాది పుష్కర కాలం దాటిన ప్రయాణమే. తెలుగులో నటిగా పరిచయమై తమిళం, హిందీకి చేరిందీ గోవా సుందరి. ఇలియానా అతి చిన్న వయసులో సినిమాల్లోకి రావడంతో ఆ వయసుకు తగినట్లే నిర్ణయాలు తీసుకుంది కానీ ఇప్పుడు సినిమాల ఎంపికలో పరిణితి చూపిస్తున్నానని అంటుంది ఆమె. అందుబాటులో ఉన్న అన్ని పరిశ్రమల్లో నాయికలు తిరగడం అలవాటే. ఇలియానా ఇలాగే ప్రయాణం చేసింది. కానీ బాలీవుడ్‌లో వరుసగా మంచి అవకాశాలు రావడం వల్లే ఇతర భాషల్లో నటించలేకపోయా అని చెబుతోంది. ఇక ప్రత్యేక గీతాల కోసం చాలా మంది నిర్మాతలు తనను సంప్రదిస్తున్నారని, అయితే అవేమీ ఆసక్తికరంగా అనిపించడం లేదని చెప్పింది ఇలియానా. గోవా సుందరి ఇటీవల మాట్లాడుతూ వయసును బట్టే పరిపక్వత వస్తుంది. అనుభవంతోనే మంచి నిర్ణయాలు తీసుకోగలం. నేను నాయికను అయ్యేప్పటికి నా వయసు 20 ఏళ్లు. కాబట్టి నా చిత్రాల ఎంపికలు అలాగే ఉండేవి. కానీ అనుభవంతో పాటే మంచి సినిమాల్లో నటించడం ప్రారంభించాను.

నటనకు ప్రతిభ ఉండి, కొంతకాలం నాయికగా నన్ను గుర్తుపెట్టుకునేలా సినిమాలు చేయాలని ఉంది. ప్రత్యేక గీతాల కోసం సంప్రదింపులు జరుగుతున్నా ఇప్పటికైతే అవేమీ ఆసక్తి కలిగించడం లేదని చెప్పింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *