సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.1.20 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును మేళ్లచెరువు మండలం ఆసరా పెన్షన్ల సొమ్ముగా కారులోని వ్యక్తులు తెలిపారు. కారును, నగదును నేరెడుచర్ల పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
