Breaking News
Home / Crime / అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం…

అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం…

తమిళనాడు: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, విలువైన కుంకుమపువ్వును కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. నడుముకు చుట్టుకున్న బ్యాండ్‌లో నిందితులు 1.8 కేజీల బంగారాన్ని తరలిస్తున్నారు. దీని విలువ రూ. 71.5 లక్షలుగా సమాచారం. అదేవిధంగా 26.5 కేజీల ఇరానీ కుంకుమపువ్వును అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దీని విలువ రూ. 63.6 లక్షలుగా సమాచారం. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Check Also

ఐదో వికెట్ కోల్పోయిన భారత్…

Share this on WhatsAppఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 303 బంతుల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *