Breaking News
Home / National / అక్రమంగా తరలిస్తున్న ధనం స్వాధీనం..

అక్రమంగా తరలిస్తున్న ధనం స్వాధీనం..

హర్యానా: కారు డిక్కిలో రూ.1.30 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో చోటుచేసుకుంది. హర్యానాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారి. నిందితుడిని ఢిల్లీకి చెందిన దివేశ్‌గా గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎంజీ రోడ్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా నగదు పట్టుబడింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదును తరలిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల నగదును సీజ్‌ చేసి, నిందితుడుని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *