Breaking News
Home / States / Andhra Pradesh / తక్షణమే ఇసుక రీచ్‌లను ప్రారంభించాలి…

తక్షణమే ఇసుక రీచ్‌లను ప్రారంభించాలి…

తూర్పు గోదావరి: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇసుక రీచ్‌లను ప్రారంభించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ సఖినేటిపల్లి, మలికిపురం మండల తాపీపని వార్ల సంఘం ఆధ్వర్యంలో మలికిపురం సెంటర్లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఏపీలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా సానుకూల స్పందన రాకపోవడంతో కార్మికులంతా ఆందోళనకు దిగారు. రాస్తారోకో అనంతరం ఎమ్మార్వో కెఎల్‌.నర్శింహరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష నేతలు మద్దతు పలికారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *