Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రాసలతో ఆకట్టుకున్న …

ప్రాసలతో ఆకట్టుకున్న …

అమరావతి: రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఇది అద్భుతమైన పథకమని వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రైతు భరోసా పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని అన్నారు. కౌలు రైతు చట్టం తీసుకువచ్చి వారి ప్రయోజనాలు కాపాడుతున్నామని చెప్పారు. ఆక్వా రైతులను కూడా ఆదుకున్న ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. తన ప్రసంగంలో ప్రాసలతో ఎమ్మెల్యే ధర్మశ్రీ సభ్యులను ఆకట్టుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్ర రూపం రైతు అని.. రాజు చేతిలోని ధర్మదండం కన్నా రైతు చేతిలోని నాగలి మిన్నా’ అని ఓ కవి చెప్పారని గుర్తు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *