Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీజకు మెరుగైన వైద్యం : సీఎం

శ్రీజకు మెరుగైన వైద్యం : సీఎం

రేగిడి: రేగిడి ఆమదాల వలస మండలం నాయిరాల వలస గ్రామానికి చెందిన తలసేమియా బాధితురాలు కొవ్వాడ శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నెల 6వ తేదీన ప్రముఖ పత్రికలో ‘చిన్నారి ప్రాణానికి ఆపద’ అనే శీర్షికపై వెలువడిన కథనానికి దాతలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభించింది. సీఎం కార్యాలయం నుంచి శ్రీజ తల్లి జ్యో తితో ఫోన్‌లో మాట్లాడారు. శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పారని జ్యోతి వెల్లడించారు. కుమార్తె అనారోగ్య స్థితిని, మెడికల్‌ సర్టిఫికెట్లను సీఎం కార్యాలయానికి పంపించామని ఆమె తెలిపారు. జిల్లాలోనూ చాలా మంది మానవతావాదులు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారని, సాయం కూడా చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *