Breaking News
Home / National / ఆస్ట్రేలియాకు ఆదిలోనే డబుల్ షాక్ !

ఆస్ట్రేలియాకు ఆదిలోనే డబుల్ షాక్ !

బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా పది పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ ఆర్చర్ బౌలింగ్‌లో ఫించ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వోక్స్ బౌలింగ్‌లో వార్నర్ కూడా బెయిర్‌స్టోకు క్యాచ్‌గా చిక్కడంతో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్స్‌ను ఆసీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఫించ్ డకౌట్ కాగా, వార్నర్ 9 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.

Check Also

యధావిధిగా కొనసాగనున్న గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Share this on WhatsAppన్యూఢిల్లీ : టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *