Breaking News
Home / Crime / అమెజాన్ కంపెనీలో …

అమెజాన్ కంపెనీలో …

హైదరాబాద్:హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలోనే ఘర్షణ జరగడంతో దీనిపై స్పందించిన యాజమాన్యం విచారణ జరిపి దాడికి పాల్పడిన ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. అమెజాన్ టోలిచౌకి బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. నవంబర్ 20న ఆఫీసులో గొడవ జరిగింది. తనపై అకారణంగా దాడి చేశాడని బాధితుడు వాపోయాడు.

Check Also

మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

Share this on WhatsAppతనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. ఇంట్లో చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని.. ఓ బాలిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *