Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీలో బీజేపీకి సినిమా చూపిస్తాం: లోకేష్

ఏపీలో బీజేపీకి సినిమా చూపిస్తాం: లోకేష్

రాజమండ్రి: ప్రధాని మోదీపై మంత్రిపై మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐలాంటి వ్యవస్థలను మోదీ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు. మోదీ, ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా అని లోకేష్‌ ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో మోదీపై ఒక్క విమర్శ చేయలేదని, జగన్‌పై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి సినిమా చూపిస్తామని లోకేష్‌ హెచ్చరించారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *