సూర్యాపేట జిల్లా: కోదాడ మండలంలోని తోగరాయ గ్రామంలో పెళ్లైన తర్వాత ఊరేగింపుకు సిద్ధమై డీజేతో బరాత్ నిర్వహించాలని అబ్బాయి తరఫు బంధువులు నిర్ణయించుకున్నారు. అయితే అమ్మాయిది ప్రకాశం జిల్లా కావడంతో ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని డీజే వద్దంటూ అమ్మాయిని, అబ్బాయిని తీసుకువెళుతుండగా అబ్బాయి తరఫు బంధువులు అడ్డుకుని వారిపై దాడికి దిగారు. దీంతో ఇరు కుటుంబాల బంధువులు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన యువకులు రెచ్చిపోయి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పెళ్లి ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
