Breaking News
Home / States / Andhra Pradesh / ఎన్నికల కమిషన్‌పై పబ్లిక్ తీవ్రస్థాయిలో

ఎన్నికల కమిషన్‌పై పబ్లిక్ తీవ్రస్థాయిలో

రాజమండ్రి: కేంద్ర ఎన్నికల కమిషన్‌పై రాజమహేంద్రవరంలో పబ్లిక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం వారు ఏబీఎన్ మీడియాతో మాట్లాడుతూ సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, అటు బీజేపీ, ఇటు వైసీపీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. రీపోలింగ్‌కు సంబంధించి పిర్యాదు అందగానే ఈసీ ఆ ప్రాంతంలో పరిశీలించి.. రీ పోలింగ్ అవసరమా? లేదా? అన్నది తెలుసుకుని నిర్వహించాలని అన్నారు. వారం రోజుల్లో కౌంటింగ్ ఉందనగా ఇప్పుడు రీ పోలింగ్ జరపడం సరికాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓట్లు గల్లంతయ్యాయని టీడీపీ పిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని, వైసీపీ చేసిన పిర్యాదుపై ఈసీ స్పందించి చంద్రగిరిలో ఐదు ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తోందని వారు మండిపడ్డారు. స్వతంత్ర్యంగా వ్యవహరించాల్సిన వ్యవస్థ ఈ విధంగా చేయడం సరికాదన్నారు.

రాజ్యాంగబద్ధంగా ఈసీకి ఉన్న అధికారాలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని పబ్లిక్ అన్నారు. ఇది చాలా అవమానకరమని, ఎన్నికల కమిషనే ఈ విధంగా ఉంటే ఇక ముందు.. ముందు ప్రజలకు భరోసా ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. మోదీ చెప్పిన విధంగా ఈసీ నడుస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఈసీ వ్యవహరించడం సరికాదని, పశ్చిమబెంగాల్‌లో కూడా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగానే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈసీ తమ విధానాన్ని మార్చుకోవాలన్నారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *