విజయవాడ: కార్తీకమాసం సందర్భంగా కృష్ణాతీరంలోని పున్నమి ఘాట్లో ఆదివారం మృత్తికా శివలింగానికి మహా రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, గుంటూరుకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాగ సాధువులు ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి వెలంపల్లితో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత కృష్ణప్రసాద్, జ్యోగి రమేష్, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, మాతా శివచైతన్య, జ్ఞానానందగిరి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకావాల్సి ఉన్నప్పటికీ రాలేదు.
