కృష్ణా : తిరువూరు పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు సిఐ మాట్లాడుతూ.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 18 న నిర్వహించుకుంటున్నామన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా.. విద్యార్థులకు పోలీసుల త్యాగాలను వివరించారు.
