Breaking News
Home / States / Andhra Pradesh / రాష్ట్రంలో పెరిగిన చలి…

రాష్ట్రంలో పెరిగిన చలి…

విశాఖపట్నం: ఉత్తర, ఈశాన్య దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఒడిశా దానికి ఆనుకుని ఉత్తర కోస్తాలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో చలి ఎక్కువగా ఉంది. అనేకచోట్ల మంచు కురుస్తోంది. రాయలసీమలో కూడా పలుచోట్ల చలి తీవ్రత నెలకొంది. శుక్రవారం విశాఖలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో చలి పెరిగి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *