Breaking News
Home / Sports / ధోనీ లేకుండానే బరిలోకి భారత్‌

ధోనీ లేకుండానే బరిలోకి భారత్‌

వెస్టిండీస్‌తో తొలి టీ20 నేడు
పుష్కరకాలం పాటు జట్టుతో అతడి అనుబంధం విడదీయలేనిది..భారత్‌ సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో ఫినిషర్‌గా అతడి పాత్ర ఎనలేనిది.. 2006లో టీ20జట్టుకు ఎంపికవడం, మరుసటి ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడమేకాదు 2007లో పొట్టి క్రికెట్‌ తొలి వరల్డ్‌ కప్‌ను జట్టుకు అందించడం అతడి సత్తాకు నిదర్శనం. అలాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌, కీపర్‌ ధోనీ లేకుండా టీమిండియా ఈసారి టీ20 బరిలోకి దిగుతోంది. అలాగే రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీకి విశ్రాంతి కారణంగా రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే తొలి టీ20లో వెస్టిండీస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

కోల్‌కతా: ధోనీ, కోహ్లీ లేని భారత జట్టు పొట్టి క్రికెట్‌లో ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ను ఢీకొనడం సవాలుగానే చెప్పాలి. టెస్ట్‌, వన్డే సిరీ్‌సలలో ఘోరంగా ఓడినా కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యంలోని కరీబియన్‌ జట్టు టీ20ల్లో ప్రమాదకారే! ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడా డు. 2016 టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్లో బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టుకు ట్రోఫీ అందించా డు. టీ20 స్టార్లు డారెన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌ చేరికతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వీరికి వన్డే సిరీ్‌సలో అద్భుతంగా రాణించిన యువ బ్యాట్స్‌మన్‌ హెట్‌మయర్‌ తోడైతే వెస్టిండీ్‌సకు తిరుగుండదు. అయితే గాయంతో ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ మొత్తం సిరీ్‌స నుంచే వైదొలగడం వెస్టిండీ్‌సకు పెద్ద దెబ్బ కానుంది.

ఊపుమీద రోహిత్‌..: ఈడెన్‌ గార్డెన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌కు కలిసి వచ్చిన మైదానమే. వన్డేల్లో 264 పరుగుల వరల్డ్‌ రికార్డును 2014లో అతడు ఇక్కడే నమోదు చేశాడు. అంతేకాదు.. 2013, 2015లో ముంబై ఇండియన్స్‌కు రెండు ఐపీఎల్‌ టైటిళ్లను ఈ గ్రౌండ్‌లోనే అందించాడు. అలాగే ఇటీవల వన్డేల్లో కనబరుస్తున్న అద్భుత ఫామ్‌ను ఈ సిరీ్‌సలోనూ కొనసాగించాలని రోహిత్‌ భావిస్తున్నాడు. కోహ్లీ లేకపోవడంతో కేఎల్‌ రాహుల్‌కు జట్టులో చోటు దక్కనుంది. దినేష్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌లతోపాటు ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యాతో మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉంది. దాంతో పాటు నెట్స్‌లో అతడు ఎక్కువ సమయం బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడంతో టీమిండియా తరపున అతడు అరంగేట్రం ఖాయమే. ధోనీ లేకపోవడంతో కీపింగ్‌ బాధ్యతలు రిషభ్‌ పంత్‌ నిర్వర్తించనున్నాడు. భువనేశ్వర్‌, బుమ్రాలతో పదునుగా ఉన్న పేస్‌ బౌలింగ్‌ ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ రాకతో మరింత వైవిధ్యం సంతరించుకుంది. చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌తో స్పిన్‌ విభాగం ఎప్పటి మాదిరే ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆధిపత్యం విండీస్‌దే..: 2009-17 మధ్య భారత్‌తో ఎనిమిదిసార్లు తలపడిన విండీస్‌ 5-2 ఆధిక్యంతో నిలిచింది. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టుపై భారత్‌ గెలుపొందలేక పోయింది. ఇక.. ముంబైలో జరిగిన సెమీఫైనల్లో నెగ్గడం ద్వారా 2016 వరల్డ్‌ కప్‌లో టీమిండియా అవకాశాలకు ఆ జట్టు గండికొట్టింది. వెస్టిండీ్‌సపై చివరి విజయాన్ని 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ సాధించింది. ఈనేపథ్యంలో కరీబియన్లపై గెలిచేందుకు రోహిత్‌ సేన తీవ్రంగా చెమటోడ్చాల్సిందే.
పిచ్‌: ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. వన్డే సిరీస్‌ తరహాలోనే మరోసారి పరుగుల వరద పారనుంది.
జట్లు
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), క్రునాల్‌ పాండ్యా, చాహల్‌, కుల్దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌,

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, హెట్‌మయెర్‌, కీమో పాల్‌, రామ్‌దిన్‌ (కీపర్‌), రూథర్‌ఫోర్డ్‌, ఓషెన్‌ థాంప్సన్‌, ఖారీ పీయరీ, మెక్‌కాయ్‌, రోవ్‌మన్‌ పొవెల్‌, నికొలాస్‌.

Check Also

గంగూలీకి కీలక బాధ్యతలు.. ఐపీఎల్‌కు ఇద్దరు దూరం

Share this on WhatsAppఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *