Breaking News
Home / National / సఫారీసేనను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్….

సఫారీసేనను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్….

వడోదర: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శిఖా పాండే (35)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ (38) ఆదుకుంది. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె (3/20), ఇస్మాయిల్‌ (2/18), ఖాకా (2/33) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సఫారీసేన భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో మరిజన్నె (29), సునే (24) ఫర్వాలేదనపించారు. భారత బౌలర్లలో ఏక్తా మూడు, దీప్తి శర్మ, రాజేశ్వరి చెరో రెండు, జోషి, జెమినా, హర్మన్‌ప్రీత్‌ తలో వికెట్‌ తీశారు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏక్తా నిలవగా మరిజన్నె ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్ అందుకుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *