Breaking News
Home / National / భారత్‌లో కరోనా విజృంభణ… కొత్తగా 9887 కేసులు…

భారత్‌లో కరోనా విజృంభణ… కొత్తగా 9887 కేసులు…

ఇండియాలో కరోనా జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. కొత్త కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉండగా… మొత్తం కేసుల్లో టాప్ 6లో ఉంది. అలాగే… డైలీ మరణాల్లో 5వ స్థానం, మొత్తం మరణాల్లో 12వ స్థానంలో ఉంది. తాజాగా ఇండియాలో 24 గంటల్లో 9887 కొత్త కేసులొచ్చాయి. ఇప్పటివరకూ ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. అలాగే… 24 గంటల్లో 294 మంది చనిపోయారు. ఇంత భారీగా చనిపోవడం ఇదే తొలిసారి. ఈ రెండు సంఖ్యలూ మనకు చెబుతున్నది ఒకటే. ఇండియాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో మొత్తం కేసులు 236657గా ఉన్నాయి. నిన్న 4611 మంది రికవరీ అవ్వడంతో… మొత్తం రికవరీ కేసుల సంఖ్య 114072గా ఉంది. మన దేశంలో కరోనా సోకిన వారిలో 48.2 శాతం మంది రికవరీ అవుతుండటం మంచివిషయం. ఐతే… కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం.ఇక మహారాష్ట్ర (80229), తమిళనాడు (28694), ఢిల్లీ (26334), గుజరాత్ (19094) కేసులతో కరోనా అత్యంత జోరుగా ఉన్న రాష్ట్రాలుగా మారాయి. వీటితో పోల్చితే… తెలుగు రాష్ట్రాల్లో కరోనా కాస్త తక్కువగానే ఉందని అనుకోవచ్చు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *