విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(7) పరుగులకే వెనుదిరిగాడు. మహరాజ్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో కాచుకొని ఉన్న ప్రొటీస్ కెప్టెన్ డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా 93 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ త్వరగా ఔటవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
