విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న జడేజాను (40, 32 బంతులు; 3 సిక్సర్లు) రబాడ బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన జడేజా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రోహిత్‌శర్మ (127) రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో మెరవగా టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారత్ 304/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. క్రీజులో కోహ్లీ (24), రహానె (15) ఉన్నారు.
