విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం అనంతరం తిరిగి బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. ఫిలాండర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై పుజారా(6) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు నష్టానికి 324 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (138), విరాట్ కోహ్లీ ఉన్నారు. రోహిత్ శర్మ (176) పరుగులు చేశాడు. రోహిత్-మయాంక్ కలిసి తొలి వికెట్‌కు 317 రికార్డు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
