Breaking News
Home / National / కిడ్నీ అమ్ముకునేందుకు భారత్‌కు..

కిడ్నీ అమ్ముకునేందుకు భారత్‌కు..

అజ్మేర్‌: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశ్‌ వ్యక్తిని పోలీసులు గత ఆదివారం అరెస్టు చేశారు. ఎందుకు భారత్‌ వస్తున్నావని అధికారులు అతడిని ప్రశ్నించగా.. కిడ్నీ అమ్ముకునేందుకు అంటూ బదులిచ్చాడు. అతడి సమాధానం విన్న పోలీసులు నోరెళ్లబెట్టారు. గత పదేళ్లలో అతడు మూడు సార్లు భారత్‌కు వచ్చి తన కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించగా విఫలమవుతున్నాడట.

‘‘మహ్మద్‌ గైని మైన్‌ అనే బంగ్లాదేశ్‌ వ్యక్తి తొలిసారిగా 2008లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. చెన్నైలో నాలుగు నెలల పాటు ఉండి తన కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది మాట్లాడే భాష అర్థం కాక వెనక్కి వెళ్లిపోయాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత వీసా మీద మళ్లీ భారత్‌ వచ్చాడు. చెన్నైలో గతంలో వెళ్లిన ఆస్పత్రికి వెళ్లి కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించాడు. ఆస్పత్రి సిబ్బంది అందుకు నిరాకరించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారినందున అతడికి ఆపరేషన్‌ చేసేందుకు అంగీకరించలేదు. దీనికి తోడు అతడి మానసిక పరిస్థితి సక్రమంగా లేదని వెనక్కి పంపించారు’’ అని పోలీసులు తెలిపారు.

మహ్మద్‌ అసలు భారత్‌కు ఎందుకు వస్తున్నాడనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. అతడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. నాలుగు నెలల క్రితం అతడు అక్రమంగా సరిహద్దు దాటి పశ్చిమ్‌బంగాలోని బంగావ్‌ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి అజ్మేర్‌ వెళ్లి ఖాదిమ్‌ సయీద్‌ అన్వర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉంటున్నాడు. అజ్మేర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లి మళ్లీ కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదే సమయంలో పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా తన కిడ్నీ అమ్ముకునేందుకే భారత్‌కు వచ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించారు.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *