ఇండోర్: ఇండోర్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు 213 పరుగులకే కుప్పకూలింది. దీంతో 130 పరుగులతో ఇన్నింగ్స్ విజయాన్ని కోహ్లీసేన సొంతం చేసుకుంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అశ్విన్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు లిటన్ దాస్(35), హసన్(38) కాసేపు రహీమ్‌తో పాటు మ్యాచ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రహీమ్ ఔట్ అయిన తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్లు వెంటవెంటనే పెవిలిన్ చేరారు. భారత బౌలర్లలో షమి 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఉమేశ్ 2 వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
