Breaking News
Home / National / ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్లు…

ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్లు…

వుహాన్‌: చైనాలో జరుగుతున్న ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల 51 కేజీల విభాగం రెండో రౌండ్‌లో తునీసియా బాక్సర్‌ బుగాన్మి బిలాల్‌ను భారత యువ బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ 4-1 తేడాతో ఓడించాడు. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అమిత్ రజతం సాధించాడు. 49 కేజీల విభాగంలో వియత్నాం క్రీడాకారుడు లిన్హ్‌ ఫుంగ్‌ను దీపక్‌ 5-0 తేడాతో ఓడించాడు. 56 కేజీలో విభాగంలోనూ భారత బాక్సర్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. వెనిజులా బాక్సర్ బొనిలాపై చిరాగ్‌ 5-0తో విజయం సాధించాడు. ప్రపంచ సైనిక క్రీడలను 25 విభాగాల్లో నిర్వహిస్తుండగా దీనిలో 109 దేశాలకు చెందిన 9,308 సైనిక క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్‌ తరఫున తొమ్మిది క్రీడా విభాగాల్లో 54 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *