Breaking News
Home / National / పాకిస్థానీ మహిళలకు భారత పౌరసత్వం….

పాకిస్థానీ మహిళలకు భారత పౌరసత్వం….

ముజఫర్ నగర్: పాకిస్థానీ మహిళ 35 ఏళ్ల తర్వాత భారత పౌరసత్వం అందుకుంది. పాకిస్థాన్‌కు చెందిన జుబేదా(55) ముజఫర్‌నగర్‌ జిల్లాలోని యోగేందర్‌పూర్‌ వాసి అయిన మహ్మద్‌ జావెద్‌ను 1994 లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన వెంటనే జుబేదా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే న్యాయపరమైన సమస్యల కారణంగా ఆమెకు అప్పట్లో పౌరసత్వం రాలేదు. అప్పటి నుంచి జుబేదా లాంగ్‌ టర్మ్‌ వీసాపై భారత్‌లో ఉంటోంది. తాజాగా జుబేదాకు భారత పౌరసత్వం వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జుబేదా భారతీయురాలు అని, ఆమె ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జుబేదాకు ఇద్దరు కూతుళ్లు రుమేషా (30), జుమేషా (26) ఉండగా..వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 25 మంది పాకిస్థానీ మహిళలు భారతీయులను వివాహమాడి ముజఫర్‌నగర్‌లో లాంగ్‌ టర్మ్‌ వీసాపై నివాసముంటున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *