Breaking News
Home / National / తాలిబన్ల చెర నుంచి భారత ఇంజినీర్లకు విముక్తి..?

తాలిబన్ల చెర నుంచి భారత ఇంజినీర్లకు విముక్తి..?

ఢిల్లీ: దాదాపు 17 నెలలుగా ఆఫ్గానిస్థాన్‌ తాలిబన్ల ఆధీనంలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజినీర్ల విడుదలకు మార్గం సుగమం అయినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం తాలిబన్లు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి కోసం అమెరికా 11 మంది తాలిన్లను విడుదల చేసేందుకు అంగీకరించినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వీరిలో తాలిబన్‌కు చెందిన ప్రముఖ నేతలు ఉన్నట్లు సమాచారం. భారతీయ ఇంజినీర్ల విడుదల సమాచారాన్ని తాలిబన్లు ధ్రువీకరించినప్పటికీ ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే భారత ప్రభుత్వానికి సైతం దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలో ఆఫ్గాన్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్గానిస్థాన్‌లోని ఉత్తర బంఘ్లాన్‌ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న భారత ఇంజినీర్లను తాలిబన్లు మే 2018లో అపహరించారు. అందులో ఒకరిని గత మార్చిలో విడిచిపెట్టగా మరో ముగ్గురు వారి చెరలోనే ఉన్నారు. తాజాగా వీరిని కూడా విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఇద్దరిని కూడా విడిచిపెట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *