Breaking News
Home / National / ఆర్టిలరీ గన్స్‌తో పాక్‌పై విరుచుకుపడిన భారత బలగాలు

ఆర్టిలరీ గన్స్‌తో పాక్‌పై విరుచుకుపడిన భారత బలగాలు

శ్రీనగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆదివారంనాడు పెద్దఎత్తున ప్రతిదాడులపై విరుచుకుపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లుపొడుస్తూ ఇవాళ ఉదయం ఇద్దరు భారత జవాన్లు, ఒక పౌరుడిని బలికొనడంతో భారత బలగాలు ప్రతిదాడులతో విజృంభించాయి. కుప్వారా జిల్లా తాంఘర్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని ఆర్టిలరీ గన్స్‌తో ఈ దాడులు జరిపింది. ఐదు నుంచి పది కిలోమీటర్ల లక్ష్యాలను ఈ ఆర్టిలరీ గన్స్ సమర్ధవంతంగా ఛేదిస్తాయి. భారత బలగాలు జరిపిన దాడుల్లో పాక్ వైపు ఏమేరకు నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. కాల్పుల మాటున చొరబాటుదారులను భారత భూభాగంలోకి పెద్ద సంఖ్యలో చొప్పించేందుకు పాక్ కొద్దిరోజులుగా ముమ్మరయత్నాలు చేస్తోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *