Breaking News
Home / Lifestyle / Business / భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు…

భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు…

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే అదరగొట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు, దేశీయంగా పెరిగిన కొనుగోళ్ల ఒత్తడితో బీఎస్ఈ సెన్సెక్స్ ఆరంభంలోనే 300 పాయింట్లు ఎగబాకింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం మరోసారి 10,800 పాయింట్లు ఎగువన ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు స్థిరంగా కొనసాగుతుండడంతో పాటు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిచ్చినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 10:14 సమయానికి సెన్సెక్స్ 338.72 పాయింట్లు (0.95శాతం) లాభంతో 36,033.82 వద్ద ట్రేడవుతుండగా… నిఫ్టీ సైతం 87.60 (0.82 శాతం) ఎగసి 10,814.95 వద్ద తచ్చాడుతోంది. మెటల్, ఆటోమొబైల్, వినియోగ, ఐటీ, బ్యాంక్స్, హెల్త్ కేర్, మౌలిక, ఇంధన రంగాలు దాదాపు 1.75 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇవాళ రూపాయి సైతం 30 పైసలు లాభంతో ప్రారంభమైంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మార్గకం విలువ రూ.69.42 వద్ద కొనసాగుతోంది.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *