Breaking News
Home / Lifestyle / Business / భారత స్టాక్ మార్కెట్లలో ఫుల్ జోష్…!

భారత స్టాక్ మార్కెట్లలో ఫుల్ జోష్…!

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్‌లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 570 పాయింట్ల లాభాన్ని నమోదు చేసి 35,002 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం మళ్లీ 10,500 మార్కును అందిపుచ్చుకుంది. తాజాగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పోటీపడడం, ముడిచమురు ధరలు దిగివస్తుండడంతో పాటు రూపాయి కూడా క్రమంగా బలపడుతుండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. మరోవైపు అమెరికా- చైనా వాణిజ్య యుద్ధంపై భయాలు తొలగుతుండడంతో ఆసియా మార్కెట్లలో సానుకూలత నెలకొందనీ.. ఇదే సెంటిమెంటు దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉదయం 11:38 సమయంలో సెన్సెక్స్ 570.51 పాయింట్ల లాభంతో 35,002.48 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 181.35 ఎగబాకి 10,561.80 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడిచమురు ధర 73 డాలర్ల మార్కు దిగువకు పడిపోవడం ఇన్వెస్టర్లకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 3.48 శాతం మేర తగ్గి 72.65 డాలర్లు పలుకుతోంది. గత ఏడు నెలల కాలంలో ముడిచమురు ధర ఇంతమేర తగ్గడం ఇదే మొదటిసారి.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *